ప్రజాశక్తి-పూత్తూరు టౌన్ : తమిళనాడు రాష్ట్రంలలో కాంచీపురం జిల్లాలో కాంచీ క్రికెట్ అకాడమి ఆధ్వర్యంలో నిర్వహించిన షేన్ వార్న్ మెమెరియల్ అండర్ 16 బాలురు 50 ఓవర్లు క్రికెట్ టోర్నమెంట్ లో పూత్తూరు శ్రీ బాలాజీ క్రికెట్ అకాడమి జట్టు ద్వితీయ స్తానంలో నిలిచినట్లు శ్రీ బాలాజీ క్రికెట్ అకాడమి కోచ్ ఎస్.బాబు తెలిపారు. ఈ సందర్భంగా కోచ్ ఎస్.బాబు మాట్లాడుతూ అకాడమి స్థాయి జట్లు ఈ టోర్నమెంట్ లో పాల్గొన్నట్లు చెప్పారు. టోర్నమెంట్ లో శ్రీ బాలాజీ క్రికెట్ అకాడమి జట్టు అత్యుత్తమ ప్రతిభ కనబరించి ఫైనల్ చేరుకొని శ్రీ బాలాజీ క్రికెట్ అకాడమి జట్టు ద్వితీయ స్థానంలో నిలవడం ఎంతో సంతోషంగా ఉన్నది ఆనందం వ్యక్తం చేశారు. జట్టులో పాల్గొన్న క్రీడాకారులు పలువురు అభినందనలు తెలిపారు.










