Oct 26,2023 19:17

మాట్లాడుతున్న నేతలు

ప్రజాశక్తి-నెల్లూరు :సోమశిల ప్రాజెక్టు నుంచి కనుపూరు కాలువకు తక్షణమే నీరు విడుదలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని సిపిఎం రూరల్‌ మండల కమిటీ డిమాండ్‌ చేసింది. గురువారం సిపిఎం జిల్లా కార్యాలయంలోని రూరల్‌ మండల కమిటీ సమావేశం నిర్వహించారు. మండల కార్యదర్శి ఆలూరు తిరుపాలు మాట్లాడుతూ రూరల్‌ మండలంలో రైతులకు మొదటి కారు వరి పంటకు నార్లు పోసుకునేందుకు ఎదురు చూస్తున్నారని కాబట్టి సోమశిల నుంచి వెంటనే నీటిని విడుదల చేయాలని కోరారు. అదే సమయంలో రూరల్‌ మండలాన్ని కరువు మండలం గా ప్రకటించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అసమానతలు లేని అభివద్ధి కోసం నవంబర్‌ 5వ తేదీ విఆర్‌ సి గ్రౌండ్‌ లో జరుగుతున్న ప్రజారక్షణభేరి బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు. మండల కమిటీ సమావేశంలో ముత్యాల నాగయ్య, శ్రీపతి వెంకయ్య, గుడి రవీంద్ర,యెగ్గోలు భాస్కర్‌, అచ్చి అనంతయ్య, జి సుధీర్‌, పర్చూరు ప్రభాకర్‌, పాదర్తి మస్తానయ్య, మరిమేసి కామాక్షయ్య ఉన్నారు.