Jul 29,2023 22:14

జనవాహిణి మధ్య అగ్నిగుండ ప్రవేశం చేస్తున్న స్వామివారు

          ప్రజాశక్తి-నార్పల   మండల పరిధిలోని గూగూడులో వెలసిన కుళ్లాయిస్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన అగ్నిగుండ ప్రవేశం కన్నుల పండువగా సాగింది. ఇందులో భాగంగా తెల్లవారుజామున మూడు గంటల నుంచి పురవీధుల గుండా స్వామివారిని ఊరేగించారు. ఉదయం 6.30 గంటల సమయంలో భక్తుల జనసందోహం మధ్య స్వామివారు అగ్నిగుండ ప్రవేశం చేశారు. స్వామివారి అగ్నిగుండ ప్రవేశ సమయంలో కుళ్లాయిస్వామి గోవిందా.. అంటూ భక్తుల నినాదాలతో గూగూడు దద్దరిల్లింది. భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సాయంత్రం కుళ్లాయిస్వామి జలదికి తరలించారు. కాగా సోమవారం రాత్రి కుళ్లాయిస్వామి చివరి దర్శనంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని ముల్లాసాబ్‌ హుస్సేన్‌ప్ప, ఆలయ కార్యనిర్వహణాధికారిణి శోభ తెలిపారు. కాగా భారీగా కందూరీలు (జంతు బలి) చేసి మొక్కలు తీర్చుకున్నారు.