కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలి
కలెక్టరేట్ ఎదుట వంటావార్పు
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్ : గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీసవేతనం రూ.26వేలు చెల్లించడంతో పాటు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బుధవారం కలెక్టరేట్ ఎదుట వంటావార్పుతో గ్రామపంచాయతీ వర్కర్లు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.చైతన్య మాట్లాడుతూ మాట్లాడుతూ కరొనా కష్టకాలంలో తమ ప్రాణాలను ఫణంగా పెట్టి ప్రజలకు సేవలు చేసిన కార్మికులకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం కనీస వేతనాలు రూ.26వేలకు పెంచకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. కార్మికుల పోరాటానికి తమ మద్దతు ఉంటుందని తెలిపారు. అనంతరం సంఘం జిల్లాకన్వీనర్ గోవిందప్ప, రామకష్ణ, మధు మాట్లాడుతూ ఎన్నికల హామీ ప్రకారం అందరినీ పర్మినెంట్ చేయాలని, ప్రతి నెలా జీతాలు చెల్లించాలని, స్వచ్ఛభారత్ కార్మికులకు నెలల తరబడి బకాయిలున్న వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేయాలి. కోర్కెల సాధన కోసం సమ్మెలోకి వెల్తామని హెచ్చరించారు. నాయకులు ఉదరు, రమణ, పొన్నుమని, మరియమ్మ, కార్మికులు పాల్గొన్నారు.
గ్రామపంచాయతీ కార్మికుల
యూనియన్ జిల్లా కమిటీ ఏర్పాటు
కలెక్టరేట్ ఎదుట జరిగిన పంచాయతీ కార్మికులు సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చైతన్య సమక్షంలో నూతన జిల్లా కమిటీని ఏర్పాటు చేశారు. జిల్లా గౌరవాద్యక్షులుగా పి.చైతన్య, జిల్లా అధ్యక్షులుగా రామకష్ణ, ప్రధానకార్యదర్శిగా గోవిందప్ప, కోశాధికారిగా మధు ఎన్నికయ్యారు. వీరితో బాటు ఉపాధ్యక్షులుగా పొన్నుమని, మరియమ్మ, సహాయ కార్యదర్శులుగా వెంకటరమణలతో బాటు 17 మంది కార్యవర్గ సభ్యులను కార్మికులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.










