ప్రజాశక్తి - గణపవరం
కంటి చూపు పట్ల ప్రతిఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్.కోండేపాడు గ్రామ సర్పంచి సీతాళం వీరవరలక్ష్మి అన్నారు. గణపవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యాన గ్రామంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కంటి వెలుగు కార్యక్రమంలో ప్రతిఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో 55 మంది వృద్ధులకు కంటి పరీక్షలు చేయగా వారందరికీ కళ్లజోళ్లు పడతాయని నేత్ర వైద్యులు శ్రీనివాస్ తెలిపారు. కళ్లజోళ్లు ప్రభత్వం ఉచితంగా అందిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో డి.గోపినాధ్, హల్త్ అసిస్టెంట్ కెవిఎస్.రెడ్డి, ఎఎన్‌ఎం కె.విజయలక్ష్మి, ఆశావర్కర్లు, కె.లక్ష్మీమాధవి, విఆర్‌ఒ కె.జానకిరామయ్య పాల్గొన్నారు.










