ప్రజాశక్తి- కోటబొమ్మాళి: చంద్రబాబుకు కంటి ఆపరేషన్ కోసం హైకోర్టు నాలుగు వారాల పాటు తాత్కాలిక బెయిల్ ఇస్తే టిడిపి నేతలు న్యాయం గెలిచిందంటూ హంగామా చేయటం హాస్యాస్పదంగా ఉందని ఎంపిపి రోణంకి ఉమామల్లేశ్వరరావు అన్నారు. బుధవారం విలేకర్లుతో మాట్లాడుతూ చంద్రబాబు కంటి ఆపరేషన్‌కోసం నాలుగు వారాలు హైకోర్టు బెయిల్ ఇచ్చిందని, నిజం, సత్యం, ధర్మం గెలిచి చంద్రబాబు బయటకు రాలేదనే విషయాన్ని టిడిపి నేతలు గుర్తుంచుకోవాలన్నారు. చంద్రబాబుకు తాత్కాలిక బెయిల్ వస్తే లోకేష్ యుద్దం మొదలైందని హెచ్చరించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబుకు ఇచ్చిన షరతులతో కూడిన బెయిల్‌కే టిడిపి సంబరాలు చేసుకుంటుందని ఎద్దేవా చేశారు. ప్రజలంతా జగన్‌మోహన్‌రెడ్డి పాలనకు అలవాటు పడ్డారని, జన్మభూమి కమిటీల పాలనవైపు చూడరని ఆయన జోష్యం చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర కళింగ కర్పోరేషన్ డ్రైరెక్టర్ సంపతిరావు హేమసుందరరాజు, మండల విప్ బొడ్డు అప్పన్న, వైసిపి నాయకులు హనుమంతు తేజ, సింగుపురం వినోద్, రాము ఉన్నారు.
ఆమదాలవలస: కంటి సర్జరీ కోసం చంద్రబాబుకు తాత్కాలిక బెయిల్‌ను హైకోర్ట్ మంజూరు చేస్తే దానికి టిడిపి నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకోవటం హాస్యాస్పదంగా ఉందని వైసిపి ప్రచార విభాగం జోనల్ ఇన్‌ఛార్జి చింతాడ రవికుమార్ అన్నారు. బుధవారం విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబుకు హైకోర్టు కంటి ఆపరేషన్ కోసం తాత్కాలికి బెయిల్ మంజూరు చేసిందని, ఆరోగ్యం సరిగా లేదని ఎవరు కోర్టుకు విన్నవించు కున్నా వారికి కోర్టు బెయిల్ మంజూరు చేస్తుందన్నారు. చంద్రబాబు ఈ రోజు వరకు కేసులో మెరిట్స్ గురించి వాదించటం లేదని, సాంకేతిక అంశాలు మీదే వాదిస్తున్నారని ఇది పరిశీలిస్తే చంద్రబాబుకు స్కిల్ స్కామ్‌లో ముడుపులు అందాయని స్పష్టంగా అర్థం అవుతుందన్నారు. సమావేశంలో వైసిపి నాయకులు ముద్దాడ ఈశ్వరరావు, దానేటి రామ్మోహన్ పాల్గొన్నారు.
కంటి ఆపరేషన్‌కు కోర్టు అనుమతిస్తే సంబరాలా?
ప్రజాశక్తి- కోటబొమ్మాళి
చంద్రబాబుకు కంటి ఆపరేషన్ కోసం హైకోర్టు నాలుగు వారాల పాటు తాత్కాలిక బెయిల్ ఇస్తే టిడిపి నేతలు న్యాయం గెలిచిందంటూ హంగామా చేయటం హాస్యాస్పదంగా ఉందని ఎంపిపి రోణంకి ఉమామల్లేశ్వరరావు అన్నారు. బుధవారం విలేకర్లుతో మాట్లాడుతూ చంద్రబాబు కంటి ఆపరేషన్‌కోసం నాలుగు వారాలు హైకోర్టు బెయిల్ ఇచ్చిందని, నిజం, సత్యం, ధర్మం గెలిచి చంద్రబాబు బయటకు రాలేదనే విషయాన్ని టిడిపి నేతలు గుర్తుంచుకోవాలన్నారు. చంద్రబాబుకు తాత్కాలిక బెయిల్ వస్తే లోకేష్ యుద్దం మొదలైందని హెచ్చరించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబుకు ఇచ్చిన షరతులతో కూడిన బెయిల్‌కే టిడిపి సంబరాలు చేసుకుంటుందని ఎద్దేవా చేశారు. ప్రజలంతా జగన్‌మోహన్‌రెడ్డి పాలనకు అలవాటు పడ్డారని, జన్మభూమి కమిటీల పాలనవైపు చూడరని ఆయన జోష్యం చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర కళింగ కర్పోరేషన్ డ్రైరెక్టర్ సంపతిరావు హేమసుందరరాజు, మండల విప్ బొడ్డు అప్పన్న, వైసిపి నాయకులు హనుమంతు తేజ, సింగుపురం వినోద్, రాము ఉన్నారు.