ప్రజాశక్తి-కందుకూరు :చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా కందుకూరులో వరుసగా 4వ రోజు బాబుతో నేను కార్యక్రమం నిర్వహించిన నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు పోస్టాఫీస్ సెంటర్ నుంచి అంకమ్మ తల్లి గుడి మీదుగా బస్టాండ్ సెంటర్ వరకు, దుకాణదారులకు కరపత్రాలు పంచి చంద్రబాబుకు మద్దతు కోరిన నాగేశ్వరరావు, పార్టీ నాయకులు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో వాస్తవాలు, గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రాలు, శిక్షణ పొంది ఉద్యోగాలు పొందిన యువత వివరాలు, పసలేని ప్రభుత్వ ఆరోపణలను వ్యాపారులకు వివరించిన నాగేశ్వరరావు చంద్రబాబు అరెస్టు కేవలం రాజకీయ కోణంలోనే జరిగిందని, సైకో మనస్తత్వంతో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని బాబు గారికి అండగా నిలబడాలని ఆయన సూచించారు. అధిక ధరలు, చార్జీలు, విపరీతంగా అప్పులు తేవడం, ప్రజల సొమ్మును దోచుకోవడం, రౌడీయిజంలో ముఖ్యమంత్రి రికార్డు సష్టించారని, రాష్ట్రాన్ని పాతికేళ్లు వెనక్కి తీసుకెళ్లారని విమర్శించారు.జగన్ కు మరో ఛాన్స్ ఇస్తే ఏం జరుగుతుందో ఊహించుకోవడం కూడా కష్టమని, మళ్లీ చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకుని భావితరాల భవిష్యత్తును బాగు చేసుకుందామని నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి ముచ్చు శ్రీను, నాయకులు చిలకపాటి మధు, వడ్డెళ్ళ రవిచంద్ర, చదలవాడ కొండయ్య, షేక్ రఫీ, బెజవాడ ప్రసాద్, గోచిపాతల మోషే, మహర్షి శ్రీను, రెబ్బవరపు మాల్యాద్రి, షేక్ మున్నా, పసుపులేటి శ్రీనివాసరావు, చుండూరి శీను, షేక్ రూబీ, షేక్ సలాం, ముచ్చు వేణు, పులి నాగరాజు, సయ్యద్ జియావుద్దీన్, షేక్ ఫిరోజ్, కరీముల్లా, పాలంకి ప్రసాద్, మంగపాటి శ్రీను, షేక్ గౌస్ బాషా, వడ్లమూడి చెంచునారాయణ, బద్దిపూడి శిఖామణి, ముప్పవరపు వేణు, ఉన్నం కొండలరావు, మచ్చా మనోహర్, గుమ్మా శివ, అత్తంటి శివకష్ణ, ధనికుల ప్రసాద్, వలేటి వెంకటేశ్వర్లు, బి. నాగేశ్వరరావు, దారం విజయకుమార్, పాండురంగారావు, దువ్వూరి కష్ణ, ఇతర నాయకులు పాల్గొన్నారు.్బంది పాల్గొన్నారు.










