Oct 19,2023 19:07

ప్రజా బ్యాలెట్‌ నిర్వహిస్తున్న దృశ్యం

ప్రజాశక్తి-కందుకూరు : కందుకూరు పట్టణంలో సిపిఎం, సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పోస్ట్‌ ఆఫీస్‌ సెంటర్‌ వద్ద రాష్ట్ర ప్రభుత్వం పెంచుతున్న కరెంటు చార్జీలకు నిరసనగా ప్రజా బ్యాలెట్‌ కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కందుకూరు బార్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ ఎం మల్లికార్జునరావు ప్రారంభించారు.ఈ సందర్బంగా మల్లికార్జునరావు మాట్లాడుతూ ఇప్పటికి జగన్‌మోహనరెడ్డి ప్రభుత్వం విద్యుత్‌ చార్జిలు 7సార్లు పెంచిందన్నారు.విద్యుత్‌ చార్జీలు పెంచబోమని చెప్పన సిఎం ఇన్ని సార్లు పెంచడం వెనుక పెద్ద కుట్ర వుందన్నారు.సంక్షెమ పధకాలు తగించడానికే కరెంట్‌ చార్జీలు పెంచడం జరుగుతుందన్నారు.గతంలో విద్యుత్‌ చార్జీలు పెంచిన సందర్బలో జరిగిన పోరాటాలకి దడిసి అతర్వాత ఎవరు పెంచడానికి సాహసించలేదన్నారు.ప్రజలు పెరుగుతున్న చార్జీలను వ్యతిరేకించాలన్నారు.ప్రజాబ్యాలెట్‌లో మొత్తం 408మంది పాల్గోనగా వారిలో 402మంది చార్జీల పెంపును వ్యతిరేకిసూ తమ ఓటువేశారు.ఒకరు మాత్రమే సమర్ధిస్తు ఓటు వేశారు.5గురు వేసిన ఓట్లు చెల్లలేదు.ప్రజాబ్యాలెట్లును రిటెరు వార్డన్‌ బి వెంకటేశ్వర్లు ఆద్వర్యంలో లెక్కించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి మాలకొండయ్య, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎస్‌ఎ గౌస్‌, సిపిఎం సీనియర్‌ నాయకులు ముప్పరాజు కోటయ్య, గుడ్లూరు సిపిఎం మండల బాధ్యులు జి వెంకటేశ్వర్లు,ఉలవపాడు సిపిఎం మండల బాధ్యులు జీవీబీ కుమార్‌, సిపిఎం కందుకూరు పట్టణ నాయకులు డి రామ్మూర్తి, ఎస్‌.కె మున్వర్‌ సుల్తానా, ఎం పద్మ , డిఎం రాయుడు, ఎం ప్రసాద్‌,సిపిఐ కందుకూరు ఏరియా కార్యదర్శి భూసి సురేష్‌, సిపిఐ నాయకులు ఆనందమోహన్‌ , నాయకులు ప్రజాసంఘాల నాయకులు వెంకటేశ్వర్లు ,పాలేటి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు