Oct 26,2023 19:50

కరపత్రాలు పంచుతున్న ఇంటూరి నాగేశ్వరరావు

ప్రజాశక్తి-కందుకూరు :చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా గురువారం కందుకూరు పట్టణంలో నిర్వహించిన బాబుతో నేను కార్యక్రమంలో కందుకూరు నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. 18వ వార్డు సంకల్ప హాస్పిటల్‌ వెనుక, బూడిద పాలెం ప్రాంతాలలో ఇంటింటి ప్రచారం నిర్వహించి కరపత్రాలు పంచారు. వైసిపి అధికారంలోకి రాగానే కంపెనీ ప్రతినిధులను భయపెట్టి, వెళ్లగొట్టారని అన్నారు. నియోజకవర్గ అభివద్ధిపై ఎవరికి ప్రేమ ఉందో ప్రజలే గమనించాలని నాగేశ్వరరావు కోరారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకాలని, కందుకూరులో పార్టీ విజయానికి అండగా నిలవాలని ఇంటూరి నాగేశ్వరరావు అభ్యర్థించారు. పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి ముచ్చు శీను, వార్డు అధ్యక్షులు నగర జయకష్ణ, నాయకులు ఈదర రవణమ్మ, సయ్యద్‌ జియావుద్దీన్‌, రావి జాలయ్య, చిడిపోతు కోటేశ్వరరావు, గనిపినేని మల్లికార్జున, షేక్‌ రాహుల్‌, చంటి, ఫాజల్‌, కాలేషా, నాగరాజ్‌ సింగ్‌ ఉన్నారు.