ప్రజాశక్తి-కందుకూరు :బాబుతో నేను కార్యక్రమాన్ని కందుకూరు పట్టణం 8వ వార్డులో నియోజకవర్గ టీడీపి ఇన్చార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు గురువారం నిర్వహించారు. చంద్రబాబు అక్రమ అరెస్టు, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న దుర్మార్గపు పాలన, వైసీపీ నేతల దందాల గురించి వివరిస్తూ కరపత్రాలు నాగేశ్వరరావు పార్టీ నాయకులు ఇంటింటికి పంచారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో వాస్తవాలు ఏమిటో, శిక్షణ పొందిన వారే బయటకు వచ్చి చెబుతున్నా ఈ చెవిటి ప్రభుత్వం వినడం లేని నాగేశ్వరరావు చెప్పారు. లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత చంద్రబాబుదన్నారు. చంద్రబాబు, లోకేష్ యాత్రలకు వస్తున్న జన స్పందనను తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి అక్రమ అరెస్టులు చేయించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని వైసీపీ నేతలు మిడిసి పడుతున్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్న విషయాన్ని గుర్తుంచుకుంటే మంచిది. అధికారులు కూడా ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదు. టిడిపి అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలకు వడ్డీతో సహా చెల్లిస్తామని నాగేశ్వరరావు చెప్పారు. కందుకూరులో వైసీపీ నేతల దందా మితిమీరి పోయింది. ఇసుక, మట్టి దోచుకోవడమే గాక కొండలను పిండి చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే కనుసన్నల్లోనే అక్రమాలు జరుగుతున్నాయని ప్రజలు గ్రహించారన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలే వారికి బుద్ధి చెబుతారు. ఈసారి కందుకూరులో పసుపు జెండా ఎగరడం ఖాయంమని నాగేశ్వరరావు అన్నారు. మీ ప్రాంతాలలో అభివద్ధి, సంక్షేమ కార్యక్రమాల తీరును ప్రతి ఒక్కరూ గమనించాలి. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అమలైన సంక్షేమ పథకాలలో సగానికి పైగా ఎత్తేశారు. బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేయడం తప్ప, జగన్ చేసిన గొప్పేమీ లేదన్నారు. ఈసారి అందరూ చంద్రబాబుకు అండగా నిలబడండి. రాష్ట్రాన్ని అభివద్ధి చేసుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి ముచ్చు శ్రీను, స్థానిక నాయకులు రావి రాంబాబు, అత్తోట మాల్యాద్రి, కలవకూరి మాధవరావు, మహర్షి శ్రీను, దివి రవిశేఖర్, వడ్డెళ్ళ వెంకట్రావు, రావి జాలయ్య, రావి వెంకటేశ్వర్లు, చిమ్మిరి రామచంద్ర ప్రసాద్, దివి మల్లికార్జున, ఓరుగంటి వెంకట్రావు, కాకుమాని ఆంజనేయులు, కాకుమాని శీను, బొట్ల రమణయ్య, నల్లూరి సింగయ్య, బెల్లం వెంకటేశ్వర్లు, పిడికిటి రఘు, గనిపినేని మల్లికార్జున, ఉన్నం కష్ణమోహన్, వేముల నాగయ్య, దివి వెంకటేశ్వర్లు, అమరా రామలింగయ్య, దివి కోటేశ్వరరావు, గుండవరపు రమేష్, ద్రోణాదుల మణి, దివి శ్రీధర్, కల్లూరి శ్రీనాథ్, పచ్చవ నవీన్, రావి పద్మ, చల్లా కష్ణవేణి, అశ్విని సుధారాణి, ముక్కు ప్రసన్న, గోగినేని రాధ, రావి వరమ్మ, వెంకటలక్ష్మి, చిమ్మిరి పావని, జొన్నలగడ్డ సుశీల, వర్దినేని వరలక్ష్మమ్మ, కంసాని మయూరి, తాటికొండ అనిల్ కుమార్, నాయకులు చదలవాడ కొండయ్య వడ్డెళ్ల రవిచంద్ర, షేక్ రఫీ, గోచిపాతల మోషే, బెజవాడ ప్రసాద్, రాయపాటి శ్రీనివాసరావు, షేక్ మున్నా, కల్లూరి వెంకటేశ్వర్లు బత్తిన మాల్యాద్రి, పులి నాగరాజు, షేక్ జియావుద్దీన్, షేక్ గౌస్ బాషా, నగర జయకష్ణ, కోటపూరి శీను, వడ్లమూడి చెంచు నారాయణ, మచ్చా మనోహర్, షేక్ మమ్ముషా, షేక్ అబ్దుల్ రెహమాన్, నల్లూరి యలమంద, లింగాబత్తిన మాల్యాద్రి మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.










