Oct 17,2023 19:08

ప్రచారం చేస్తున్న ఇంటూరి

ప్రజాశక్తి-కందుకూరు :కందుకూరు పట్టణం 9వ వార్డు పరిధిలోని ప్రకాశంకాలనీ, ఇందిరమ్మ నగర్‌, కాకుమానివారి పాలెంలో 'బాబుతో నేను' కార్యక్రమం మంగళవారం జరిగింది. టిడిపి ఇన్‌ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు.చంద్రబాబు అక్రమ అరెస్టుపై ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ సొమ్ము ఎంత దోచుకున్నా, జగన్‌ ధనదాహం తీరడంలేదని విమర్శించారు. పట్టణ పార్టీ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి ముచ్చు శ్రీను, స్థానిక నాయకులు చదలవాడ కొండయ్య, వంకాయలపాటి రాజేంద్రప్రసాద్‌ ఏసుపోగు రవి, మద్దాలి రమేష్‌, చదలవాడ సురేంద్రబాబు, చదలవాడ కిషోర్‌, పర్సు కోటయ్య , చదలవాడ దావీదు, మాతంగి కొండయ్య, గౌడపేరు రోశయ్య, నాయకులు షేక్‌ రఫీ, వడ్డెళ్ళ రవిచంద్ర, గోచిపాతల మోషే, రెబ్బవరపు మాల్యాద్రి, రాయపాటి శ్రీనివాసరావు, బెజవాడ ప్రసాద్‌, షేక్‌ మున్నా, సవిడిబోయిన వెంకటకష్ణ, ముచ్చు వేణు, పులి నాగరాజు, షేక్‌ సలాం, కోటపూరి శ్రీనివాసులు ఉన్నారు.