Oct 29,2023 18:18

కందుకూరులో ఆర్‌టిసి కార్మికుల నిరసన

ప్రజాశక్తి -కందుకూరు :కావలి పట్టణం సమీపంలో ఆటోనగర్‌ ఆర్టీసీ డిపో డ్రైవర్‌ రాంసింగ్‌ పై దుండగులు చేసిన దాడికి నిరసనగా కందుకూరు డిపోలో ఆదివారం అన్ని యూనియన్లు జేఏసీగా ఏర్పడి గేట్‌ మీటింగ్‌ నిర్వహించటం జరిగింది .ఈ కార్యక్రమానికి ఎంప్లాయిస్‌ యూనియన్‌ రీజినల్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ డి.వై .కొండలు అధ్యక్షత వహించారు .ఈ గేటుమీటింగ్‌ ను ఉద్దేశించి ఎంప్లాయిస్‌ యూనియన్‌ డిపో అధ్యక్షులు ఎం.ఎస్‌.ఎన్‌ .రాజు మాట్లాడుతూ దుండగులను అరెస్టు చేసి వారిపై నాను బైలబుల్‌ కేసులు పెట్టాలని డిమాండ్‌ చేశారు .ఎన్‌ ఎం యు అధ్యక్షులు కోటయ్య మాట్లాడుతూ ప్రభుత్వము నిరంతరం ప్రజా సేవ చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులకు భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. వైఎస్‌ఆర్‌ యూనియన్‌ నాయకులు శ్రీనివాస రావు, ఎస్‌ డబ్ల్యూ ఎఫ్‌ నాయకులు శ్రీనివాసరావు మాట్లాడుతూ దాడి చేసిన వ్యక్తులను అరెస్టు చేయాలని ,పోలీస్‌లు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లోను కాకుండా నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌ విధించాలని డిమాండ్‌ చేసినారు. ఆర్టీసీ ఉద్యోగులు చేస్తున్న నిరసన కార్యక్రమానికి యుటిఎఫ్‌ నాయకులు కోటేశ్వరరావు సంఘీభావం తెలిపి దుండగులను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ డ్రైవర్‌ పై దాడిని ఖండించినారు. జెఎసి నాయకులు సి సి ఎస్‌ డెలిగేట్‌ సుబ్బారావు , సదానందం, శివకష్ణ ,రహమతుల్లా, కే శ్రీనివాసరావు, రమణారెడ్డి, కష్ణారెడ్డి ,గంగాధర్‌ ఉన్నారు.