ప్రజాశక్తి -పుంగనూరు: పుంగనూరు నియోజకవర్గం గతంలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉండేదని తిరిగి అది సాధించడానికి ప్రతి కార్యకర్త ఓ సైనికుల్లా పనిచేయాలని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ చల్లా రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక బైపాస్ రోడ్డులో టిడిపి కార్యాలయాన్ని రాజంపేట పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గంట నరహరి, నియోజకవర్గ ఇన్చార్జ్ చల్లా రామచంద్రారెడ్డిలు గురువారం ప్రారంభించారు. పట్టణానికి విచ్చేయడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో పాటు బైక్ ర్యాలీతో, అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. పార్టీ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్చార్జ్ చల్లా రామచంద్రారెడ్డి రాజం పేట పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గంట నరహరి మాట్లాడుతూ పుంగనూరు నియోజకవర్గంలో 2024లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయడానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లాగా పని చేయాలని సూచించారు. అధికార పార్టీ ఆదేశాలతో అధికారులు తెలుగు దేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలను టిడిపి కార్యాలయ ప్రారంభోత్సవానికి రానివ్వకుండా అడ్డుకున్నప్పటికీ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారన్నారు. కార్యకర్తల ఉత్తేజం , ఉత్సాహం చూస్తుంటే గెలుపు అసాధ్యం కాదని తెలుస్తుందన్నారు. కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకుడు రామనాథం నాయుడు, నాయకులు శ్రీకాంత్, దేశాధి ప్రకాష్, సి.వి.రెడ్డి, సోమల సురేష్, బాలాజీ రాయల్ పోలీస్ గిరి, సయ్యద్ సుహేల్ భాష సద్దాం, రామయ్య, రెడ్డప్ప నాయుడు, ప్రేమ్ కుమార్ నాయుడు మాధవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.










