ప్రజాశక్తి- కలకడ (చిత్తూరు) : కలకడ మండలంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా వేణుగోపాల్ రెడ్డి బాధ్యతలు స్వీకరించినట్లు ఎస్‌ఐ రవి ప్రకాష్ రెడ్డి శుక్రవారం తెలిపారు. గతంలో ఇతను తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఇంటలిజెన్స్ ఈ విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ బదిలీపై వచ్చి కలకడలో హెడ్‌కానిస్టేబుల్ గా బాధ్యతలు చేపట్టారు.










