Nov 04,2022 22:41

కలెక్టర్‌ను కలిసిన వార్డు సచివాలయ ఉద్యోగులు

కలెక్టర్‌ను కలిసిన వార్డు సచివాలయ ఉద్యోగులు
ప్రజాశక్తి -తిరుపతి టౌన్‌ తిరుపతి జిల్లా కలెక్టర్‌ వెంకటరమణ రెడ్డిని గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ తిరుపతి జిల్లా అధ్యక్షులు తోటకూర కోటేశ్వరరావు ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చారు. ఇందులో భాగంగా సుమారు 400 మంది వార్డు సచివాలయ ఉద్యోగులకు గత ఆగస్టు నెలలో సర్వీసులు టార్గెట్‌ పూర్తి చేయని కారణంగా ఒక రోజు జీతం నిలుపుదల గురించి ఉన్నత అధికారులను పలుమార్లు కలిసి వినతి పత్రాలు ఇచ్చిన ఇప్పటివరకు ఉద్యోగుల ఖాతాల్లో నిలుపుదల చేసిన జీతాన్ని జమ చేయలేదని పేర్కొన్నారు . సచివాలయ ఉద్యోగులను ఇతర శాఖలకు డిప్యుటేషన్‌ చేయడం వలన ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పరచినటువంటి సచివాలయ వ్యవస్థ నిర్వీర్యం అవుతోందని, ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల పథకాల అమలులో ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయం గురించి కలెక్టర్‌ కి సవివరంగా తెలిపారు. కలెక్టర్‌ సానుకూలంగా స్పందించి డిప్యూటేషన్ను వెంటనే రద్దు చేస్తామని, నిలుపుదల చేసిన జీతాన్ని ఉద్యోగులకు ఇప్పిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.