Jun 06,2022 12:57

ప్రజాశక్తి -కలెక్టరేట్‌ (చిత్తూరు) : చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు మండలం నెల్లెపల్లె వెంకటపతి నగర్‌కి చెందిన చిన్నా అనే వివాహిత చిత్తూరు కలెక్టరేట్‌ వద్ద నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య యత్నం చేసింది. వెంటనే స్పందించిన వైద్య సిబ్బంది ఆమెను ఆసుపత్రికి తరలించింది. కుటుంబ సమస్యల నేపథ్యంలో కలెక్టర్‌కి వినతి చేసేందుకు వచ్చి ఇక్కడే నిద్ర మాత్రలు మింగిందని వివాహిత చిన్నా కుమార్తె మీడియాకు తెలిపారు.