కలెక్టరేట్ ఎదుట ఉద్యోగ, ఉపాధ్యాయుల ధర్నా
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉద్యోగ, ఉపాధ్యాయులకు జిపిఎస్ (గ్యారంటీ పెన్షన్ స్కీమ్) విధానాన్ని అమలు చేయాలని క్యాబినెట్లో తీర్మానించారు. ఇది ఉద్యోగ ఉపాధ్యాయులకు ఏమాత్రం ఆమోద యోగ్యం కాదని ఫ్యాప్టో చేపట్టిన చలో కలెక్టరేట్ కార్యక్రమంలో ఫ్యాప్టో జిల్లా చైర్మన్ ఏ.మునాఫ్ పేర్కొన్నారు. 2004 నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చి తీరని అన్యాయం చేశారని అన్నారు. ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన వారంలో సిపిఎస్ రద్దు చేస్తానని మాట ఇచ్చారు కానీ లక్షలాది మంది ఉపాధ్యాయ, ఉద్యోగులకు ఇష్టం లేని జిపిఎస్ తీసుకువచ్చి తీరని అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యాప్టో రాష్ట్ర నాయకులు టి.రఘుపతి రెడ్డి, గంటా మోహన్, చెంగలరాయ మందడి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు జీవి.రమణ, దేవరాజుల రెడ్డి, కిరణ్‌కుమార్, రామమూర్తి, అరుణ్ కుమార్, ముక్తార్ అహ్మద్, మునీర్ అహమ్మద్, సోమశేఖర్ నాయుడు, మోహన్, ఎస్‌పి బాషా, మదన్ మోహన్ రెడ్డి, జగదీష్, ఏపి సిపిఎస్ ఈఏ నాయకులు పి. సుధాకర్, శ్రీనివాసులు, కడియాల మురళీ, సమీర్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
డీఈవోకు యుటిఎఫ్ నేతల వినతి
ఉపాధ్యాయ సమస్యలపై సోమవారం జిల్లా విద్యాశాఖాధికారి విజయేంద్రరావును యుటిఎఫ్ నాయకులు రఘుపతిరెడ్డి, జివి రమణలు కలసి వినతి చేశారు. జిల్లాలోని ఉపాధ్యాయుల సమస్యలను డీఈఓ దృష్టికి తీసుకొచ్చారు. వ్యక్తిగత సమస్యలపై డీఈవో స్పందించి పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఈసందర్భంగా యుటిఎఫ్ నేతలు మాట్లాడుతూ జిల్లా విద్యాశాఖ పరిధిలోని సమస్యలను డీఈవో దృష్టికి తీసుకురాడం జరిగిందన్నారు. డీఈవో సానుకూలంగా స్పందించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన్నట్లు తెలిపారు.










