May 13,2023 21:36

కలెక్టర్‌కు పూల మొక్క అందజేస్తున్న ఉద్యోగ సంఘం నాయకులు

ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌   ఎపి జెఎసి అమరావతి రాష్ట్ర రాష్ట్ర చైర్మన్‌ బొప్పారాజు వెంకటేశ్వర్లు కలెక్టర్‌ ఎం.గౌతమిని మర్యాద పూర్వకంగా శనివారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు. శనివారం జిల్లాకు విచ్చేసిన ఆయన జెఎసి అమరావతి, రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ నేతలతో కలిసి కలెక్టర్‌ను పుచ్చగుచ్చాలు అందజేశారు. అనంతరం ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. ఈనెల 17న అనంతపురంలో ఎపి జెఎసి అమరావతి రెండవ ప్రాంతీయ సదస్సు నిర్వహణ ఏర్పాట్లపై అసోసియేషణ్‌ నేతలకు పలు సూచనలు, సలహాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎపి జెఎసి అమరావతి జిల్లా ఛైర్మన్‌ ఆర్‌ఎన్‌.దివాకర్‌రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి పిఎస్‌.ఖాన్‌, క్లాస్‌ ఫోర్త్‌ రాష్ట్ర అధ్యక్షుడు మల్లేశ్వర్‌రావు, రాష్ట్ర విఆర్‌ఒ జనరల్‌ సెక్రటరీ సాంబ శివరావు, రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కుళ్లాయప్ప, మధునాయక్‌, క్లాస్‌ ఫోర్త్‌ రాష్ట్ర జనరల్‌ సెక్రటరీ తోట చెన్నప్ప, డ్రైవర్స్‌ అసోసియేషన్‌ రమేష్‌, ఎఐటియసి జిల్లా అధ్యక్షుడు రాజేష్‌, గ్రామ వార్డు సచివాలయాల అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ సల్మాన్‌ బాషా, వినరు, వెటర్నిటీ శ్రీనివాసులు పాల్గొన్నారు.