కిర్మాణి సఫ్దర్ హుస్సేన్‌కు డాక్టరేట్
ప్రజాశక్తి-కావలి : కావలికి చెందిన కిర్మాణి సఫ్దర్ హుస్సేన్‌ను గౌరవ డాక్టరేట్ వరించింది. సామాజిక సేవా రంగంలో విశేషంగా సేవలు అందించిన హుస్సేన్‌ను ఆదివారం తెలంగాణ రాష్ట్రం, వరంగల్ జిల్లా, హనుమకొండలోని హోటల్ శ్రేయలో జరిగిన ఓ కార్యక్రమంలో ''నవనిర్మాణ ప్రజా సంక్షేమ సమితి'' ఎన్.హుస్సేన్‌కు ''గౌరవ డాక్టరేట్‌ను'' ప్రదానం చేసి సత్కరించింది. లక్కావజ్జుల విజయసుబ్రహ్మణ్య సిద్ధాంతి ఐఎఎస్, విశ్వజ్యోతి విజ్ఞాన సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ విశ్వనాథ్, ప్రముఖ జ్యోతిష్య పండితులు, నంది అవార్డు గ్రహీత డాక్టర్ చక్రధర్ సిద్ధాంతి ఈ అవార్డును హుస్సేన్‌కు ప్రదానం చేసి గౌరవించారు. ఆయన సేవలను కొనియాడారు. అనంతరం కిర్మాణి సఫ్దర్ హుస్సేన్ మాట్లాడుతూ ఈ గౌరవ డాక్టరేటు తనలో మరింత బాధ్యతను పెంచిందన్నారు. సామాజిక కార్యక్రమాలు అంటే తనకు చాలా మక్కువ అని చెప్పిన హుస్సేన్, ఈ సేవలను గుర్తించి తనను గౌరవ డాక్టరేట్‌తో సత్కరించిన ''నవనిర్మాణ ప్రజా సంక్షేమ సమితి'' వారికి తాను కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు వివరించారు. సహకరించిన ప్రతిఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. భవిష్యత్తులో కూడా సేవే పరమావిధిగా భావించి, తాను సామాజిక సేవకు అంకితం అవుతానని హుస్సేన్ ఉద్ఘాటించారు.










