ప్రజాశక్తి-అనంతపురం స్థానిక సుభాష్ రోడ్డు లోని కీర్తి మెడికల్స్ ప్రథమ వార్షికోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ఆ సంస్థ జనరల్ మేనేజర్ ధర్మేంద్ర ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ ధర్మేంద్ర, అనంతపురం స్టోర్ మేనేజర్ మధుసూదన్ మాట్లాడుతూ.. అనంతపురం జిల్లా ప్రజల ఆదరణతో సంవత్సర కాలం పాటు కీర్తి మెడికల్స్ సంస్థ దిగ్విజయంగా ముందడుగు వేసిందని అన్నారు. కస్టమర్ల శ్రేయస్సు కోరుతూ లాభపేక్ష ప్రధానం కాకుండా వచ్చే ఆదాయంలో 20 శాతం కస్టమర్లకు నేరుగా డిస్కౌంట్ రూపంలో అందిస్తున్నట్లు తెలిపారు. అనంత ప్రజల అభిమానాన్ని ఆశిస్తూ తమ సంస్థ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్లు ఇస్తున్నట్లు తెలిపారు. కొన్ని స్పెషాలిటీ ప్రాడక్ట్స్‌పై అదనపు డిస్కౌంట్ రూపంలో అందిస్తున్నామని వెల్లడించారు. అసిస్టెంట్ స్టోర్ మేనేజర్ అరుణ్, పవన్, సిబ్బంది మీనా కుమారి, మౌనిక, భాగ్య, ధరణి, సుహాసిని, శైలజ, మధు, అనిల్, అజరు, నగర ప్రముఖులు పాల్గొన్నారు.










