Mar 31,2022 22:59

ఉచిత మందులు పంపిణీ చేస్తున్న దశ్యం



ప్రజాశక్తి-పుత్తూరు టౌన్‌:
సంస్థ వ్యవస్థాపకుడు కోనేటి రాజు ఆధ్వర్యంలో స్థానిక ప్రజలకు మోకాళ్లు, కీళ్ల నొప్పులు, నడుము నొప్పులున్న వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రవిరాజు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రతి రోజు ఉదయం నడకను అలవాటు చేసుకోవాలని, కొద్దిసేపు శారీరక వ్యాయామం చేయాలన్నారు. ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉండడం వల్ల బయటకు వెళ్లేటప్పుడు గొడుగు, టోపీలను వాడాలన్నారు. ఎండలకు రోజుకు కనీసం 4 నుంచి 5 లీటర్ల నీరు తాగాలన్నారు. మజ్జిగ ఎక్కువగా తాగాలని సూచించారు. పాండిచ్చేరికి చెందిన ఎస్‌కెఎన్‌. ఆర్గానిక్‌ సంస్థ (ఎంఆర్‌) ఎమ్‌.కిరణ్‌కుమార్‌, తరణ్‌ 150 మంది గ్రామ ప్రజలకు కీళ్ల నొప్పుల నివారణా మందులను ఉచితముగా అందించారు. ఈ కార్యక్రమంలో కోనేటి వెంకటరామరాజు, నరసమ్మ, జయమ్మ, కష్ణవేణమ్మ, విజయలక్ష్మి, స్వాతి, సుభద్ర, చంద్రకళ, రాజమ్మ, వసంత ,సరస్వతి, మంగమ్మ, సంపూర్ణ, చంద్ర గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.