ప్రజాశక్తి-పుత్తూరు టౌన్ : పుత్తూరులోని ఉషోదయ వాకర్స్ అసోసియేషన్ శ్రీబొమ్మరాజు పురంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగినది. సంస్థ వ్యవస్థాపకుడు కోనేటి రాజు ఆధ్వర్యంలో ప్రజలకు మోకాళ్లు, కీళ్ల నొప్పులు, నడుము నొప్పులు ఎక్కువగా ఉన్నందున ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగినది. ఈ సందర్భంగా రవి రాజు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రతి రోజు ఉదయం నడకను అలవాటు చేసుకోవాలని, మరి కొద్దిసేపు శారీరక వ్యాయామం చేయాలన్నారు. ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉండడం వల్ల బయటకు వెళ్లేటప్పుడు గొడుగు, టోపీ గాని వాడాలి. ఎండలకు రోజుకు కనీసం 4 నుంచి 5 లీటర్ల నీరు తాగాలన్నారు. మజ్జిగ ఎక్కువగా తాగాలని సూచించారు.పాండిచ్చేరి కి చెందిన ఎస్.కె.ఎన్. ఆర్గానిక్ సంస్థ మెడికల్ రెప్రజెంటేటివ్, ఎమ్.కిరణ్ కుమార్,తరణ్ ద్వారా 150 మంది గ్రామ ప్రజలకు కీళ్ల నొప్పుల నివారణా మందులు ఉచితముగా పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో కోనేటి వెంకటరామరాజు, నరసమ్మ, జయమ్మ ,కృష్ణవేణమ్మ, విజయలక్ష్మి ,స్వాతి ,సుభద్ర , చంద్రకళ, రాజమ్మ ,వసంత ,సరస్వతి మంగమ్మ ,సంపూర్ణ,చంద్ర ఇంకా గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు .










