Mar 10,2022 22:03

మాధవ్‌


ప్రజాశక్తి-కెవిబిపురం:
మండల కేంద్రంలో గురువారం ప్రెస్‌క్లబ్‌ ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడిగా ఆంధ్రనాడు విలేకరి నత్తం మాధవ్‌ ఉపాధ్యక్షుడిగా ప్రజాశక్తి ఢిల్లీబాబును సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా వార్త భాస్కర్‌, ట్రెజరర్‌, పీఆర్‌ఓగా సాక్షి భాగ్యరాజ్‌, సభ్యులుగా సీనియర్‌ పాత్రికేయుడు విజి.రెడ్డి, ప్రసాద్‌లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మాధవ్‌ మాట్లాడుతూ పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి తన వంతు కషి చేస్తానన్నారు. ప్రెస్‌క్లబ్‌ ఏర్పాటుపై ప్రజాప్రతినిధులు, అధికారులు హర్షం వ్యక్తం చేసారు. నూతన పదవి బాధ్యతలు చేపట్టిన వీరికి అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు.