
విస్తరణ పనులను పరిశీలిస్తున్న మంత్రి అప్పలరాజు
ప్రజాశక్తి- పలాస: పలాస కెటిరోడ్డు పనులు శరవేగంగా చేపట్టి తొందరలో పూర్తి చేయాలని రాష్ట్ర మత్య, పశుసంవర్ధకశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు గుత్తేదారుడు మెదలవలస మన్మధరావుకు ఆదేశించారు. కెటిరోడ్ విస్తరణ పనులు చివరిదశకు చేరుకొని తారురోడ్డు నిర్మాణం పనులు జరుగుతున్న నేపథ్యంలో పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు. నిర్మాణ పనులకు ఎటువంటి అడ్డంకులు ఉన్నా వాటిని తక్షణమే తొలిగించి శరవేగంగా పనులు చేపట్టాలన్నారు. ఈయనతో పాటు కౌన్సిలర్లు, వైసిపి నాయకులు, మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులు సునీల్ కుమార్, ఎఇ అవినాష్ ఉన్నారు.