ప్రజాశక్తి-అనంతపురం సిటీ కస్తూరిబా పాఠశాలలను నిత్యం పర్యవేక్షిస్తూ ఉండాలని డిఇఒ, ఇన్‌ఛార్జి ఎపిసి ఎం.సాయిరాం సూచించారు. జిల్లాలోని కెజిబివి ఎస్‌ఒలతో శనివారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా డిఇఒ మాట్లాడుతూ వచ్చేవారంలో రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ ప్రవీణ్‌ప్రకాష్ జిల్లాకు రానున్న నేపథ్యంలో ఎస్‌ఓలు నిత్యం కెజిబివిలను పర్యవేక్షించాలని ఆదేశించారు. పర్యవేక్షణకు వెళ్లినప్పుడు విద్యార్థులు ఏవిధంగా చదువుతున్నారు.. టీచర్లు ఏ విధంగా పాఠాలు చెబుతున్నారు.. మెనూ అమలు చేస్తున్నారా.. వంట గది శుభ్రంగా ఉందా.. లేదా.. మరుగుదొడ్లు శుభ్రంగా ఉన్నాయా.. లేవా.. అని పరిశీలించాలన్నారు. అలాగే విద్యార్థులకు యూనిఫాం, పుస్తకాలు ఇచ్చారా.. బైజ్యూస్ ట్యాబులను వినియోగిస్తున్నారా? లేదా? అని కూడా చూడాలన్నారు. కేజీబీవీల్లో ఏమైనా జరిగిగే ఎస్‌ఒలదే బాధ్యత అన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తే కాంట్రాక్టు రద్దు చేయడంతోపాటు క్రిమినల్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.
'స్పాట్'లోకి ఎవరూ రాకూడదు : డిఇఒ
అనంతపురంలోని కెఎస్‌ఆర్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు టెన్త్ స్పాట్ వాల్యూషన్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో వాల్యూయేషన్ విధులకు ఆర్డర్స్ తీసుకున్న టీచర్లు, హెచ్‌ఎంలు, ఎంఈవోలు మినహా ఇతరులు అనవసరంగా రాకూడదని డిఇఒ తెలిపారు. అత్యవసరంగా డిఇఒను కలవాలంటే సాయంత్రం 4:30 గంటల తర్వాత ముందస్తు అనుమతితో లోపలికి రావాలన్నారు.
టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న డిఇఒ సాయిరాం










