May 24,2023 22:03

డిప్యూటీ డిఇఒకు వినతిపత్రం అందజేస్తున్న ఐక్య విద్యార్థి సంఘం నాయకులు

        అనంతపురం కలెక్టరేట్‌ : నిబంధనలకు విరుద్ధంగా ముందస్తు అడ్మిషన్లు చేస్తున్న కేశవరెడ్డి విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం నగరంలోని కేశవరెడ్డి విద్యా సంస్థల ఎదుట ఆందోళన చేపట్టారు. ఈసందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఓతూరు పరమేష్‌ మాట్లాడుతూ కేశవరెడ్డి విద్యా సంస్థల్లో నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్లు జరుగుతున్నాయని చెప్పారు. గతంలో కూడా ఈ విద్యా సంస్థ తల్లిదండ్రుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి మోసం చేసిందన్నారు. మళ్లీ అలాంటి విద్యా సంస్థకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం విచారకరం అన్నారు. తక్షణం ఈ కేశవరెడ్డి విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అనంతరం డిప్యూటీ డీఈవోను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐక్య విద్యార్థి సంఘం నాయకులు పాల్గొన్నారు.