ప్రజాశక్తి - తాడేపల్లిగూడెం
నేడు సమాజంలో కేన్సర్ రోగులు రోజురోజుకూ పెరిగిపోతున్నారని, కేన్సర్‌కు అనేక కారణాలు ఉన్నాయని వెంకట్రామన్నగూడెం పిహెచ్‌సి వైద్యాధికారి హర్ష తెలిపారు. ఆదివారం కేన్సర్‌పై అవగాహనా సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మనం తినే ఆహార పదార్ధాల్లో కేన్సర్ కారక మలినాలు ఉంటున్నాయన్నారు. అధిక దిగుబడి కోసం పంటలకు అధిక మోతాదులో పురుగు మందులు, ఎరువులు వాడడం, ఆహార పదార్థాలను ప్లాస్టిక్ కవరల్లో, ప్లాస్టిక్ పాత్రల్లో నిల్వ ఉంచడం, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినడం వల్ల కేన్సర్‌కు కారణం అన్నారు. మన జీవన విధానంలో మార్పు అవసరమన్నారు. అత్యవసర పరిస్థితిలో మాత్రమే బయట ఆహారం తినాలన్నారు. మనం ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యం ఉంటుందని, తద్వారా దేశం ఆర్థిక అభివృద్ధిలో ముందంజలో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిహెచ్‌ఒ సత్యనారాయణ, సీనియర్ అసిసెంటంట్ నాగేశ్వరరావు, పిహెచ్‌ఎన్ విరోనిక, ఫార్మాసీస్ట్ రామారావు, హెచ్‌వి.జ్యోతి, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.










