కేన్సర్ నివారణపై సదస్సు
ప్రజాశక్తి-కావలి : కేన్సర్ నివారణ నిర్మూలన మన చేతులలో ఉందని నెల్లూరు రెడ్‌క్రాస్ కేన్సర్ హాస్పిటల్ డైరెక్టర్, గైనకాలజిస్టు డాక్టర్ టి.లక్ష్మి పేర్కొన్నారు. మంగళవారం డి.బి.ఎస్. ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన 424వ కేన్సర్ నివారణపై అవగాహన సదస్సులో డాక్టర్ టి.లక్ష్మి మాట్లాడారు. నేటి కాల్యుష ప్రపంచంలో మనం తినే ఆహారం నుండి తాగే నీరు, పిల్చేగాలి ఇవి మన శరీరంలో మార్పు తిసుకొచ్చి శరీరంలోని డిఎన్‌ఎ వ్యవస్థపై పనిచేసి కణాల ఉత్పతి పెరిగి కేన్సర్ కారకం అవుతుందన్నారు. కనుక అందరూ ఆలవాట్లు మార్చుకొని జంక్‌ఫుడ్, ఆయిల్ ఫుడ్స్, ప్లాస్టిక్ వాడకం పూర్తిగా మాని, మంచి ఆలవాట్లను అలవార్చుకుంటే కేన్సర్‌ను నిరోధించవచ్చని తెలియజేశారు. దృశ్య రూపకంగా విద్యార్థులకు వివరిస్తూ యువతలో మార్పు వస్తే ఇంటిలోని పెద్దవారిలో మార్పు వస్తుందని విపులీకరించారు. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంటు దామిశెట్టి సుధీర్‌నాయుడు మాట్లాడుతూ నేటి యువత కేన్సర్ నివారణపై అవగాహన కలిగి నేటి విద్యార్థులే రేపటి కేన్సర్ నిర్మూలన కర్తలుగా మారాలని విద్యార్థులను ఉదేశించి మాట్లాడారు. నెల్లూరు రెడ్‌క్రాస్ కేన్సర్ హాస్పిటల్ నుండి విచ్చేసి అవగాహనా సదస్సు నిర్వహించిన డాక్టర్లు టి.లక్ష్మికి, కన్యాకుమారికి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి వి రావు, కళాశాల పరిపాలనాధికారి జి.రమేశ్ బాబు, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.










