Mar 28,2022 22:53

తాసిల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేస్తున్న అంగన్వాడి ఆశ వర్కర్స్‌



ప్రజాశక్తి - ఎస్‌ఆర్‌ పురం :

మండల కార్యాలయం నుంచి పుల్లూరు క్రాస్‌ వరకు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.. అంగన్వాడి వర్కర్స్‌ హెల్పర్స్‌ లకు కేంద్ర ప్రభుత్వం కనీస వేతన చట్టం అమలు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం తరహ లో జీతం ఇవ్వాలని పెండింగ్లో ఉన్న టి ఎ బిల్లును వెంటనే అమలు చేయాలన్నారు రు ప్రైవేటీకరణ జాతీయ నగరీకరణ కార్యక్రమాన్ని రద్దు చేయాలి గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేటాయింపులు పథకాన్ని పట్టణ ప్రాంతాలకు విస్తరించాలని అన్నారు సంక్షేమ పథకాలు అమలు చేయాలి రేషన్‌ కార్డులు తొలగించ రాదు హెల్పర్‌ ల ప్రమోషన్లో రాజకీయ జోక్యాన్ని అరికట్టాలి అని అన్నారు ఈ కార్యక్రమంలో అంగన్వాడి మండల అధ్యక్షురాలు చెంచులక్ష్మి బిల్డింగ్‌ వర్కర్స్‌ జిల్లా అధ్యక్షుడు లక్ష్మయ్య సెక్రెటరీ నరసింహులు ఎస్‌ఆర్‌ పురం అధ్యక్షులు ప్రకాష్‌ జానపద కళాకారులు నాయకులు శేషాద్రి చరణ్‌ మోహన్‌ గజేంద్ర రమేష్‌ విశ్వనాథన్‌ వెంకటేశులు అంగన్వాడి వర్కర్స్‌ హెల్పర్‌ ఆశా వర్కర్స్‌ తదితరులు పాల్గొన్నారు.