కలెక్టరేట్ వద్ద సిపిఎం ఆధ్వర్యాన ధర్నా - బడ్జెట్లో రాష్ట్రానికి తీరని అన్యాయం - సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం
ప్రజాశక్తి - భీమవరం
పేదలు, సామాన్య, మధ్య తరగతి ప్రజలపై భారాలు వేసి కార్పొరేట్లకు అనుకూలంగా ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌ను తక్షణం సవరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2023-24 బడ్జెట్‌ను వ్యతిరేకిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో స్థానిక జిల్లా కలెక్టరేట్ వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా మండుటెండలో నేలపై బైఠాయించి నిరసన తెలిపారు. ఉక్కు ఫ్యాక్టరీకి నిధులు, విశాఖకు రైల్వే జోన్, ఆపాలి విశాఖ ఉక్కు అమ్మకాన్ని అరికట్టాలి, అధిక ధరలను, కార్మికుల హక్కు, కార్మికులు, నిరుద్యోగులు ఉపాధి కాపాడాలని, వివిధ రంగాల్లో ఉన్న ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని నినాదాలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభకు పట్టణ కార్యదర్శి బి.వాసుదేవరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా బలరాం మాట్లాడుతూ పార్లమెంట్‌లో బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2023-24 కేంద్ర బడ్జెట్ సామాన్య, మధ్యతరగతి ప్రజలకు, రైతాంగానికి ఏమాత్రం ప్రయోజనకరంగా లేదన్నారు. ధరల పెరుగుదలను అరికట్టే ప్రయత్నమే చేయలేదని విమర్శించారు. గత బడ్జెట్ కంటే కేటాయింపులు పెంచాల్సింది పోయి భారీగా కోతలు పెట్టడం దారుణమన్నారు. దీనివల్ల ప్రజలపై మరిన్ని భారాలు పడతాయన్నారు. ఒకవైపు దేశంలో ఆర్థిక సంక్షోభం రానుందని ఆర్థిక శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నా కేంద్ర ప్రభుత్వం కనీసం పట్టించుకోకుండా కార్పొరేట్లకు అనుకూలంగా బడ్జెట్ ప్రవేశపెట్టిందని ఆరోపించారు. బడ్జెట్లో రైతులకు, పేదలకు ఇచ్చే ఆహార సబ్సిడీ, మధ్యాహ్న భోజనం, గ్రామీణ ప్రాంతాల్లో పేదల కడుపు నింపుతున్న ఉపాధి హామీ, గ్యాస్ సబ్సిడీలో భారీ కోతతో పాటు దేశంలో 80 శాతం మందికి ఉపయోగపడే అన్ని పథకాల్లో కోతలు విధించారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్ ప్రస్తావన లేకపోవడం దారుణమన్నారు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు దాటుతున్నా విభజన హామీలైన రాజధాని నిర్మాణం, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఇస్తామన్న నిధులు, బడ్జెట్ లోటు, బకాయిలు ఇవ్వకపోవడం రాష్ట్రం పట్ల కేంద్రం వైఖరికి నిదర్శనమన్నారు. పోలవరంను జాతీయ ప్రాజెక్టు అని ప్రచారం చేసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టు కోసం ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. దేశంలో ప్రభుత్వరంగ సంస్థలను నూరుశాతం అమ్మే తీరుతామని కేంద్ర ప్రభుత్వం చెబుతుందని, దీనిలో విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ కూడా రాష్ట్రానికి దూరం చేయాలని చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రయివేటీకరిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని, ప్రాణ త్యాగాలతో విశాఖ ఉక్కును సాధించుకున్నామని గుర్తు చేశారు.
జిల్లా అభివృద్ధికి కేటాయింపులు శూన్యం
జిల్లాలో ఆక్వా రంగం ద్వారా వేల కోట్లు ఆదాయం, ధాన్యాగారం ద్వారా దేశానికి ఆహార భద్రత అందిస్తున్న జిల్లా అభివృద్ధికి బడ్జెట్లో మాత్రం ఏ కేటాయింపులు లేవని బలరాం ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ-నిడదవోలు రైల్వే డబ్లింగ్ పనులను పూర్తి చేయడానికి సరిపడా నిధులు ఇవ్వకపోవడం కేంద్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలుస్తుందన్నారు. మరోవైపు కోటిపల్లి నరసాపురం రైల్వేలైన్‌కు అంతంతమాత్రంగానే నిధులు కేటాయించడం సబబు కాదన్నారు. జిల్లాలో ఆధ్వర్యంలో అభివృద్ధి చెందుతుంటే దానిద్వారా వేల కోట్లు ఆదాయం పొందడమేగాని ఆక్వా యూనివర్సిటీకి మాత్రం నిధులు ఇవ్వకపోవడం దారుణన్నారు. తాడేపల్లిగూడెంలో ఉన్న ఉద్యాన యూనివర్సిటీకి, నిట్ విస్తరణకు కేటాయింపులు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. భీమవరం పట్టణానికి ఇవ్వాల్సిన ఎక్స్‌లెన్స్ నిధులు ఇవ్వలేదన్నారు. కాలుష్య నివారణకు సరైన ప్రణాళిక నిధులను ప్రకటించలేదన్నారు. జిల్లాలో పుష్కలంగా ఉన్న ఆయిల్ సహజ వాయు నిక్షేపాలను జిల్లా నుండి భారీగా తరలించడం తప్ప జిల్లా అభివృద్ధికి చేసిందేమీ లేదని ఆరోపించారు. ఈ బడ్జెట్‌ను కేంద్ర ప్రభుత్వం తక్షణం సవరించి తిరిగి ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నేతలు ఎం.వైకుంఠరావు, మామిడిశెట్టి రామాంజనేయులు, ఇంజేటి శ్రీనివాస్, డి.నాగు, బి.వరలక్ష్మి, కె.కృష్ణ, బొక్కా సత్యనారాయణ, డి.త్రిమూర్తులు, కలిపిండి సత్యనారాయణ, నాగమణి, కె.సాయమ్మ, కె.కుమారి, రమేష్ పాల్గొన్నారు.
తణుకు రూరల్: బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ కార్పొరేట్లకు దేశ సంపదను దోచిపెడుతూ, ప్రజలపై భారాలు వేసేదిగా ఉందని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పివి.ప్రతాప్ విమర్శించారు. శుక్రవారం స్థానిక నరేంద్ర సెంటర్‌లో కేంద్ర బడ్జెట్‌ను నిరసిస్తూ ధర్నా నిర్వహించి బడ్జెట్ నమూనా ప్రతులు దహనం చేశారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎ.అజయకుమారి, కామన మునిస్వామి, గార రంగారావు, పిఎల్.నర్సింహారావు, ఎన్.ఆదినారాయణబాబు, కేశవ, ఎం.గోవిందరాజు, అంబటి బ్రాహ్మజీ, ఎం.రమేష్, ఫణిబాబు, శ్రీనివాస్, ఎన్.చిన్నారావు, టి.వెంకటేశ్వరరావు, టి.రామకృష్ణ పాల్గొన్నారు.
తాడేపల్లిగూడెం: రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిన కేంద్ర బడ్జెట్‌ను వ్యతిరేకించాలని కోరుతూ సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక పోలీసు ఐల్యాండ్ వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కర్రి నాగేశ్వరరావు, పట్టణ కమిటీ సభ్యులు కరెడ్ల రామకృష్ణ మాట్లాడుతూ మోడీ బడ్జెట్ కార్పొరేట్ శక్తులకు రాయితీలిచ్చేలా, పేద, మధ్యతరగతి ప్రజలపై భారాలు మోపేలా ఉందన్నారు. కార్యక్రమానికి చిటికిన రాము, మేట్రేటి రమణ, జవ్వాది శ్రీను, రౌతు వెంకట్ నాగేంద్ర, వర్రి అప్పారావు, సిద్దిరెడ్డి శేషుబాబు, పోతు శ్రీను, అయినాల ధర్మారావు, అగుర్తుల రామోహనరావు, అయినాల సత్యనారాయణ పాల్గొన్నారు.
పాలకొల్లు : ప్రజలకు వాతలు.. కార్పొరేట్లకు కాసులు కురిపించే కేంద్ర బడ్జెట్‌ను వ్యతిరేకించాలని సిపిఎం మండల కార్యదర్శి జవ్వాది శ్రీనివాసరావు కోరారు. పట్టణంలో శుక్రవారం కరపత్రాలు పంచి నిరసన తెలిపారు. కార్యక్రమంలో జుత్తిగ రాము, పి.నాగేశ్వరరావు, జి.గోవిందరావు, దుర్గారావు, చిన సత్యనారాయణ, కె.రాజారావు, రత్తయ్య, శ్రీనివాస్, వీరాస్వామి, అప్పారావు, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
తాడేపల్లిగూడెం: కేంద్ర బడ్జెట్‌ను నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో మాధవరం సచివాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం సచివాలయ సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం నేత కండెల్లి సోమరాజు మాట్లాడగా జి.వెంకట్రావు, పి.జయమ్మ, కె.నాగమణి, పసలపూడి విశ్రాంతి, తీగిరిపల్లి కృప, కడిమి నాగమణి, బెల్లంకొండ సత్యనారాయణ, బి.అప్పారావు, కడెం కుమారి, టి శ్రావణి పాల్గొన్నారు.
పెంటపాడు: కేంద్ర బడ్జెట్‌ను వ్యతిరేకిస్తూ సిపిఎం ఆధ్వర్యాన తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు చింతకాయల బాబూరావు, మండల కార్యదర్శి చిర్ల పుల్లారెడ్డి, సిఐటియు నాయకులు సిరపరపు రంగారావు మాట్లాడుతూ బడ్జెట్‌లో పేదల సబ్సిడీలకు, రైతులకు, వ్యవసాయ, కార్మికులకు, దళితులకు, గిరిజనులకు వివిధ రంగాలకు కేటాయింపులు గతం కన్నా భారీగా కోత విధించారని విమర్శించారు. బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన ద్రోహాన్ని అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి, జనసేన పట్టించుకోకపోవడం దారుణమన్నారు. కార్యక్రమంలో బంకురు నాగేశ్వరరావు, మాదాసు శ్రీను, వెలగల పల్లారెడ్డి, కరక వెంకట్రావు, సత్తి శ్రీనివాసరెడ్డి, కొయ్యల శ్రీను, కొయ్యన చంటి. వేపకాయల సత్యనారాయణ పాల్గొన్నారు.
ఆచంట: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అన్ని రంగాలకు అరకొరగా నిధులు కేటాయించి మన రాష్ట్రానికి మరోసారి మొండిచెయ్యి చూపిందని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కేతా గోపాలన్ అన్నారు. సిపిఎం ఆధ్వర్యాన శుక్రవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. కార్యక్రమంలో నాయకులు సిర్రా నరసింహమూర్తి, మచ్చ సుబ్బారావు, ఇందుకూరి సూర్యనారాయణరాజు, తోటపల్లి సత్యనారాయణ, కుసుమే జయరాజు, రాయపాటి మధుకిరణ్, వీరయ్య, కె.రాజు, నరసింహమూర్తి పాల్గొన్నారు.
నరసాపురం: కేంద్ర బడ్జెట్‌ను వ్యతిరేకిస్తూ తహశీల్దార్ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు కవురు పెద్దిరాజు, పట్టణ కార్యదర్శి ముచ్చర్ల త్రిమూర్తులు మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్లో రాష్ట్రం, జిల్లాకు తీవ్రమైన నష్టం చేకూర్చారన్నారు. అనంతరం తహశీల్దార్ ఎమ్‌డి.సాజిల్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నేతలు బొక్కా శ్రీనివాసరావు, జల్లి రామ్మోహన్‌రావు, గుత్తుల శ్రీరామచంద్రుడు, వాటాల ధనుంజరు, గుబ్బల చిన్ని, దొంగ భాస్కరరావు, మంచిలి నీలకంఠం, పొన్నాడ రాము, పొగాకు నారాయణరావు, బూడిద జోగేశ్వరరావు, మోకా శివరాజు తదితరులు పాల్గొన్నారు.
యలమంచిలి: కేంద్ర బడ్జెట్‌కు వ్యతిరేకంగా మండలంలోని చించినాడ జాతీయ రహదారిపై సిపిఎం ఆధ్వర్యాన నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు బాతిరెడ్డి జార్జి మాట్లాడగా నేతలు కానేటి బాలరాజు, దేవ సుధాకర్, సరిపల్లి జయప్రభ, గొల్ల ఏడుకొండలు, గోగినేని సత్యనారాయణ, ఎస్.బాబూరావు, ఎస్.నాగమణి, బాతిరెడ్డి సుగుణ, పల్లేరు దాసు పాల్గొన్నారు.
పెనుగొండ: కేంద్ర బడ్జెట్‌ను నిరసిస్తూ తహశీల్దార్ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యాన ఆందోళన చేపట్టారు. నాయకులు షేక్ పాదుషా మాట్లాడగా కప్పల రత్నంరాజు, గుర్రాల సత్యనారాయణ, నాగిశెట్టి గంగారం, నాగేశ్వరరావు, యేసు, గెద్దాడ శ్రీనివాసు పాల్గొన్నారు.
పెనుమంట్ర: కేంద్ర బడ్జెట్‌ను నిరసిస్తూ బ్రాహ్మణ చెరువు చిన్న వంతెన వద్ద సిపిఎం ఆధ్వర్యాన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల కార్యదర్శి కూసంపూడి సుబ్బరాజు మాట్లాడగా ఇందుకూరి వెంకట్రాజు, తెన్నేటి ఆంజనేయులు, మాదాసు లక్ష్మణరావు, చదలవాడ చిన్నబ్బులు, కముజు రామకృష్ణ, వేజర్ల సూర్యనారాయణ, తానేటి నాగేశ్వరరావు, దంపనబోయిన ఏలియా, చింతపల్లి అప్పారావు పాల్గొన్నారు.
వీరవాసరం: కేంద్ర బడ్జెట్ కార్పొరేట్లు దోచుకోవడానికి తప్ప ప్రజాప్రయోజనాలకు ఉపయోగకరంగా లేదని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు జుత్తిగ నరసింహమూర్తి అన్నారు. కేంద్ర బడ్జెట్‌ను వ్యతిరేకిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో శుక్రవారం నవుడూరు జంక్షన్‌లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింహమూర్తి మాట్లాడగా కేతా జ్యోతిబసు, మల్లుల సత్యనారాయణ, యాళ్లబండి నారాయణమూర్తి, మైగాపుల రాంబాబు, గొట్టుముక్కల శ్యాంబాబు, నూకరాజు, రమేష్, గిద్దా శ్రీను పాల్గొన్నారు.
భీమవరం రూరల్: కేంద్ర బడ్జెట్‌కు వ్యతిరేకంగా సిపిఎం ఆధ్వర్యాన మండలంలో వెంప, తోకతిప్ప గ్రామాల్లో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల కన్వీనర్ ఇంజేటి శ్రీనివాస్ మాట్లాడారు.










