Feb 26,2023 19:50

ప్రజాశక్తి - ఆకివీడు
కార్పొరేట్లకు దోచిపెడుతున్న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో రాష్ట్రానికి, జిల్లాకు తీరని అన్యాయం చేసిందని సిపిఎం నాయకులు విమర్శించారు. కేంద్ర బడ్జెట్‌ను నిరసిస్తూ ఆదివారం స్థానిక ఎస్‌ టర్నంగ్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు పెంకి అప్పారావు మాట్లాడుతూ బడ్జెట్లో రాష్ట్రానికి వచ్చిన లోటును పునరుద్ధరించాలని కోరారు. కేంద్ర బడ్జెట్‌ సామాన్యులకు, పేదలకు ఉపయోగకరంగా లేదన్నారు. కార్పొరేట్లకు పన్ను పెంచాల్సింది పోయి 10 శాతం తగ్గించడం వల్ల సామాన్యులకు తీరం నష్టం కలుగుతుందన్నారు. ఆర్థిక మోసగాళ్లకు మోడీ భుజం కాస్తున్నారన్నారు. ప్రత్యేక హోదా ప్రస్తావన లేకపోగా రైల్వే జోన్‌ మాట కూడా లేదని విమర్శించారు. తమ జిల్లాకు జరిగిన అన్యాయానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. పార్టీ సీనియర్‌ నాయకులు షేక్‌ వలీ మాట్లాడుతూ ఇంత జరుగుతున్న వైసిపి ప్రభుత్వం నోరు విప్పకపోవడం విడ్డూరమన్నారు. కార్యక్రమంలో నాయకులు బోడ్డు పద్మ, బి.రాంబాబు, పిట్ట పాండురంగారావు, మణిపూర్‌ సత్యం , నెల్లి సూరిబాబు, మల్లేష్‌, నాగరాజ, ప్రభాకర్‌, అలు అప్పారావు పాల్గొన్నారు.