Mar 28,2022 22:41

సిఎండికి వినతి ఇస్తున్న దృశ్యం


ఎపిఎస్‌పిడిసిఎల్‌ సిఎండికి వినతి
ప్రజాశక్తి-తిరుపతి సిటి
ఈ మేరకు ఆ సంఘం ఆధ్వర్యంలో ఏపిఎస్‌పిడిసిఎల్‌ సిఎండి హరినాధరావును సోమవారం డిస్కం కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాన్యుడు మొదలు ధనవంతుడి వరకు ప్రతి ఒకిరిక వినోద సాధనం కేబుల్‌ టీవి మాత్రమేనన్నారు. గతంలో చంద్రబాబు జీవో నెంబరు 15 ద్వారా కరెంట్‌ పోల్స్‌కు కేబుల్‌ వైర్‌ కట్టినందుకు ఆపరేటర్లు విద్యుత్‌సంస్థకు డబ్బులు చెల్లించాలని ఆదేశించారు. కేబుల్‌ ఆపరేటర్ల విజ్ఞప్తితో దాన్ని నిలుపుదల చేశారు. అప్పడు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్‌రెడ్డి కేబుల్‌ ఆపరేటర్లకు ఇచ్చిన హామీ మేరకు తాను అధికారంలోకి వచ్చిన వెంటనే పోల్‌ ట్యాక్స్‌ను పూర్తిగా రద్దు చేస్తామని, కేబుల్‌ ఆపరేటర్లకు భీమా సౌకర్యం కల్పిస్తామని, కేబుల్‌ ఆపరేటర్లను ఆసంఘటిత కార్మికులగా గుర్తించి ఐడి కార్డులు ఇస్తామని, వారికి ప్రత్యేకంగా కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి రుణాలు మంజూరు చేస్తామని, వారి సమస్యలన్ని పరిస్కరిస్తామని హామీ ఇచ్చారన్నారు. ఇప్పడు తాజాగా ఎలక్ట్రికల్‌ డిపార్టుమెంట్‌ అధికారులు కేబుల్‌ ఆపరేటర్లకు ఏ రాష్ట్రంలో లేని విధంగా పోల్‌ ట్యాక్స్‌ విధించారని, పల్లెల్లో ఒక్కో స్థంబానికి రూ.50 అదనం జిఎస్‌టి రూ.9, మునిసిపాలిటిల్లో రూ.75, జిఎస్‌టి 14, కార్పొరేషన్‌లో స్థంబానికి 100, జిఎస్‌టి 18 రూపాయుల చొప్పున చెల్లించాలని నోటీసులు ఇవ్వడం దారుణమన్నారు. దీనిపై ముఖ్యమంత్రి, ఉన్నతాధికారులు స్పందించి పోల్‌ట్యాక్స్‌ రద్దు చేయాలని డిమాండు చేశారు. ఈ కార్యక్రమంలో పెరుమాళ్‌ మదు, కె.శంకర్‌, రాజేష్‌, ఆనంద్‌, కోటేశ్వరరావు పాల్గొన్నారు.