
* రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్: సుదీర్ఘ కాలం పాటు పనులు నిలిచిపోయిన కోడి రామ్మూర్తి స్టేడియం పునర్నిర్మాణం పనులు త్వరితగతిన నిర్మించేందుకు కృషి చేస్తామని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. థ్యాంక్ యూ సిఎం పేరిట వైసిపి ఆధ్వర్యాన స్టేడియం వద్ద ఆదివారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిఎం నగరానికి వచ్చినప్పుడు హామీనిచ్చారని, ఈ మేరకు రూ.12 కోట్లు నిధులు మంజూరు చేసి మాట నిలబెట్టుకున్నారని అన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా ఇచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తి జగన్ అని ప్రశంసించారు.క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతగానో ప్రోత్సహిస్తున్నట్టు చెప్పారు. పాలనా సంస్కరణలతో పాటు సంక్షేమానికి ప్రాధాన్యత నిస్తున్నామని అన్నారు. ఫిబ్రవరి నాటికి జిల్లా కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ నిర్మాణం పూర్తవుతుందని అన్నారు. ఆ భవన నిర్మాణం తాను సాధించిన విజయంగా చెప్పారు. కార్యక్రమంలో జిల్లా వైసిపి అధ్యక్షులు, నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్, కార్పొరేషన్ చైర్మన్లు అంధవరపు సూరిబాబు, మామిడి శ్రీకాంత్, నగర వైసిపి అధ్యక్షులు సాధు వైకుంఠరావు, ఎంఎస్‌అర్, గులోనా, సుంకరి కృష్ణ, సుందరరావు, మెంటాడ స్వరూప్, సాంబమూర్తి పాల్గొన్నారు.