Jun 05,2023 22:52

కరపత్రాలు పంపిణీ చేస్తున్న సిపిఎం నాయకులు

         ప్రజాశక్తి-గుంతకల్లురూరల్‌   మండల పరిధిలో ఉన్న 17వేల మంది కౌలురైతులను ఆదుకోవాలని సిపిఎం నాయకులు డిమాండ్‌ చేశారు. ఈమేరకు సోమవారం స్థానిక కార్యాలయంలో తహశీల్దార్‌ బి.రాముకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు దాసరి శ్రీనివాసులు, భజంత్రీ శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్రంలో 70 శాతం మంది రైతులు కౌలుకు చేస్తూ పెట్టుబడి గిట్టుబాటుగాక అప్పల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. ప్రభుత్వాలు గుడ్డిగా భూస్వాముల వైపు నడిపిస్తూ అత్యధికంగా ఇన్సూరెన్స్‌ పథకాలు తీసుకొస్తున్నాయన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కౌలు రైతులను గుర్తించి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో పెద్దఎత్తున ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు బి.తిమ్మప్ప, జగ్గలి రమేష్‌, కసాపురం రమేష్‌, నాగరాజు, మల్లికార్జున, వెంకటేష్‌, చందు, తదితరులు పాల్గొన్నారు.
బహిరంగ సభను జయప్రదం చేయండి
కౌలు రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 12న నిర్వహించనున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని సిపిఎం నాయకులు పిలుపునిచ్చారు. ఈమేరకు మండల పరిధిలోని కసాపురం, సంగాల, దోసలోడికి గ్రామాల్లో సిపిఎం నాయకులు పర్యటించి కౌలురైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ ఈనెల 5వ తేదీ నుండి కౌలు రైతుల సమస్యలపై జీపుజాత, పాదయాత్ర ప్రారంభ సభ, పాదయాత్ర ఉంటాయన్నారు. అదేవిధంగా ఈనెల 12న రాయబారంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో లక్షలాది మంది రైలు పాల్గొని మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు బి.శ్రీనివాసులు, దాసరి శ్రీనివాసులు, సిఐటియు నాయకులు సాకే నాగరాజు, కసాపురం రమేష్‌, తదితరులు పాల్గొన్నారు.