Oct 19,2023 19:31

జగనన్న సురక్ష కిట్‌ అందజేస్తున్న దృశ్యం

జగనన్న సురక్ష కిట్‌ అందజేస్తున్న దృశ్యం
కావలి రూరల్‌ జగనన్న సురక్ష
ప్రజాశక్తి-కావలి రూరల్‌ :మండల పరిధిలోని సిరిపురం పంచాయతీలో గురువారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌ రెడ్డి సతీమణి ఆదిలక్ష్మి పాల్గొన్నారు. అనంతరం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో సిరిపురం, నారాయణ పురం, గ్రామ ప్రజలు ఆరోగ్య సమస్యలు గురించి అడిగి తెలుసుకొని ఆరా తీశారు.అనంతరం ఆదిలక్ష్మి బాలింతలకు పౌష్టికాహారం కిట్లను అందజేయడం జరిగింది. కార్యక్రమంలో ఎంపిపి ఆలూరు కొండమ్మ, ఎంపిడిఒ ఏవి కష్ణమోహన్‌, ఎపిఎం కాంతారావు, ఎఎంసి చైర్మన్‌ సన్నిబోయిన ప్రసాద్‌ యాదవ్‌, జెడ్‌పిటిసి జంపని రాఘవులు, సిరిపురం ఉప సర్పంచ్‌ జ్యోలారావు, గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.