Sep 28,2023 22:30

తేజేశ్వరరావు

ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌ : పలాస మండలం లొత్తూరుకు చెందిన గిరిజన ట్రాక్టర్‌ డ్రైవర్‌ సవర వల్లభరావుపై చేయి చేసుకున్న కాశీబుగ్గ సిఐ శంకరరావు, ఎస్‌ఐ ఖాదర్‌ బాషాపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, కార్యదర్శి ఎన్‌.గణపతి ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. గిరిజనుడిపై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండించారు. పనిచేసే కార్మికుడు ఎవరు ఏ పని చెప్పినా చేస్తారని, కార్మికులపై పోలీసు అధికారులు తమ ప్రతాపం చూపించడం సరైంది కాదని పేర్కొన్నారు. ఈ విషయంపై పోలీస్‌ ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని బాధిత కార్మికునికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.