ప్రజాశక్తి-పెద్దవడుగూరు కార్యకర్తలే తెలుగుదేశం పార్టీ బలమని మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జె.సి ప్రభాకరరెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని షాదీఖానా మైదానంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్యకర్తలో టిడిపికి గొప్ప వరం అన్నారు. టిడిపికి పూర్వవైభవం తీసుకురావాలంటే కార్యకర్తలు గట్టి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. మండలాన్ని అభివృద్ధి చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందన్నారు. ఎందుకంటే టిడిపి హయాంలో నీటి శుద్ధ జలకేంద్రం, సీసీరోడ్లు, చెక్‌డ్యాములు నిర్మించడంతోపాటు ఎల్‌ఎస్‌ఈడి దీపాలను ఉచితంగా అందించామన్నారు. పేట శివాలయం రోడ్డును విస్తరణ చేయడంతోపాటు సీసీరోడ్డును అంతర్గత మురుగు కాలువలను ఏర్పాటు చేసి సౌకర్యంగా ఉండేలా చేపట్టామన్నారు.
కావున రానున్న ఎన్నికల్లో కూడా టిడిపి విజయం సాధించేందుకు సైనికుల్లా పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు ఆవులాంపల్లి కేశవరెడ్డి, కొండూరు కేశవరెడ్డి, బాలిరెడ్డి, గంగరాజు, నారాయణస్వామి, బాషా, నాగన్న, దివాకరరెడ్డి, హరినాథరెడ్డి, చిరంజీవి, హరిక్రిష్ణారావు, ప్రసాద్‌యాదవ్, ఎద్దుల రామచంద్రారెడ్డి, వెంకట్రామిరెడ్డి, రమేష్‌యాదవ్, సుంకిరెడ్డి, నాగేశ్వరరెడ్డి, తిలక్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్‌రెడ్డి










