ఉద్యానవన శాఖ కార్యాలయంపై కనిపించని త్రివర్ణ పతాకం
ప్రజాశక్తి-గుత్తి దేశమంతా మంగళవారం 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగుతుంటే గుత్తిలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో మాత్రం మువ్వన్నెల జెండా ఎగరకపోవడం బాధాకరం. పట్టణంలోని ఉద్యానవన శాఖ కార్యాలయంపై త్రివర్ణ పతాకాన్ని అధికారులు ఎగురవేయలేదు. అలాగే గుత్తి ఆర్‌ఎస్‌లోని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంకులపై జాతీయ జెండాను ఎగరవేయలేదు. అధికారులు స్పందించి ఆ కార్యాలయ అధికారులపై చర్యలు చేపట్టాలని పలువురు అంటున్నారు.










