ప్రజల వద్దకు వెళ్లండి....
అధికారులపై ఎమ్మెల్యే ఎంఎస్‌బాబు ఆగ్రహం
సమావేశంలో మహిళా సర్పంచ్‌ల భర్తలు
ప్రజాశక్తి -యాదమరి
అధికారులు వచ్చామా ....వెళ్ళామా ....అని కాదు కార్యాలయాల్లో కూర్చుంటే పనులు జరగవు.. గ్రామాల్లో తిరిగి గ్రామసభలు పెట్టండి, ప్రజా సమస్యలపై చర్చించండి .ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరువయ్యేలా కషి చేయాలని, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని పూతలపట్టు నియోజకవర్గ ఎమ్మెల్యే బాబు అధికారులను ఆదేశించారు. ఆదివారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో యాదమరి మండల అధ్యక్షుడు సురేష్ బాబు అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. అన్ని శాఖల సమీక్ష సమావేశంలో వ్యవసాయ శాఖ విద్యుత్ శాఖ హౌసింగ్ శాఖ పశుసంవర్ధక శాఖ గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులపై ఎమ్మెల్యే అసంతప్తి వ్యక్తం చేశారు.
మీరు తీరు మార్చుకోకుంటే బదిలీలు తప్పవని హెచ్చరించారు.. సర్వసభ్య సమావేశానికి సర్పంచులు, ఎంపీటీసీలు ప్రజ ప్రతినిధులు మాత్రమే సమావేశానికి రావాలని నిబంధన ఉన్నా మహిళా సర్పంచులు భర్తలు సమావేశంలో కూర్చొన్నారు. అయితే అధికారుల ముందే సమ స్యలను మండల స్థాయి అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా సర్పంచి ఉండగా భర్తలు అధికార దర్పం చూపి స్తున్నా అధికారులు అందరూ ప్రేక్షకపాత్ర వహించారు. ఒకరు కూడా మహిళా ప్రజా ప్రతినిధి మాట్లాడాలని కానీ, వారికి అవకాశం ఇవ్వాలని కానీ, మీరు మాట్లాడకూడదని వాదించిన పాపానపోలేదన్నారు. మహిళా సర్పంచులకు విలువ లేకుండా పోయింది. ఈ సమావేశంలో జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ ధనుంజయ రెడ్డి, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు సురేష్ బాబు, మండల అభివద్ధి అధికారి హరిప్రసాద్ రెడ్డి, అన్ని శాఖల అధికారులు సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.










