జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్
ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ మరణించిన ఉద్యోగుల, టీచర్ల కుటుంబ సభ్యులు సాంఘిక భద్రతా పథకం కింద జీవనోఫాది కోరుతూ, కారుణ్య నియామకాల కింద ఉద్యోగావకాశాలు కల్పించమని సోమవారం జిల్లా పరిషత్‌లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్ జి.శ్రీనివాసులుని, జడ్పీ సీఈఓ ప్రభాకర రెడ్డిని కోరారు. ఈవిషయంపై జెడ్‌పి ఛైర్మన్ స్పందిస్తూ, అర్హులైన ఉద్యోగుల పిల్లలకు త్వరితగతిన ఉద్యోగ నియామకాలు చేపడతామని తెలిపారు. అనంతరం అన్నమయ్య జిల్లా మదనపల్లి ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో గ్రామీణ నీటి సరఫరాకు సంబంధించిన అన్ని పనులపై సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. అలాగే చేపట్టిన పనులు త్వరితగతిన పూర్తి చేయవలయునని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ మొహమ్మద్ మతీన్, డీఈలు ఎం. వేణుగోపాల్ రెడ్డి (వాల్మీకిపురం), టి.రెడ్డెప్ప (పీలేరు), కె.అశోక్ (తంబళ్ళపల్లి), టి.సురేష్ రెడ్డి (మదనపల్లి), జి.శ్రీహరి (తంబళ్ళపల్లి), ఏఈలు కె. బాలచంద్ర (మొలకల చెరువు), బి.హరి ప్రసాద్ (పెద్దమండ్యం), తదితరులు పాల్గొన్నారు.










