Mar 17,2023 21:08


ప్రజాశక్తి - తణుకు రూరల్‌
త్రిపురలో కార్మికవర్గంపై బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ చేస్తున్న దాడులను ఖండించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి పివి.ప్రతాప్‌ అన్నారు. తేతలి వైజంక్షన్‌ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతాప్‌ మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు రావడం ప్రారంభంకాగానే బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ దాడులు చేయడం జరిగిందన్నారు. నేటికీ త్రిపురలో ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసి, నియంతృత్వం ధోరణికి పాల్పడుతోందన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు కార్యదర్శి గుబ్బల గోపి, టి.రామకృష్ణ, శ్రీహరి, కృష్ణ, రమణ, నాగేశ్వరరావు పాల్గొన్నారు.