Mar 18,2023 22:26

నిరసన తెలుపుతున్న సత్యసాయి వాటర్‌ సప్లై కార్మికులు

ప్రజాశక్తి-ఉరవకొండ      కార్మికుల సమస్యలు పరిష్కరించి ఉద్యోగ భద్రత కల్పించాలని సత్యసాయి వాటర్‌ సప్లై యూనియన్‌ ఉపాధ్యక్షులు బాలకృష్ణ పేర్కొన్నారు. శనివారం ఉరవకొండ మండల పరిధిలోని పెద్ద కౌకుంట్ల గ్రామంలో ఉన్న సత్యసాయి వాటర్‌ సప్లై పంపుహౌస్‌ వద్ద కార్మికులు శనివారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రావాల్సిన బోనస్‌ లీవ్‌ లు, గ్రాట్యుటీ చెల్లించే వరకు సమ్మె విరమించేది లేదన్నారు. నెలలు తరబడి జీతాలు ఇవ్వకున్నా ప్రజల దాహార్తిని తీరుస్తున్న కార్మికుల కుటుంబాల గురించి మాత్రం పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. సంబంధిత జిల్లా స్థాయి అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మల్లన్న, శీనప్ప, బొజ్జప్ప, ఎర్రిస్వామి, సూరి, ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.