కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
ప్రజాశక్తి-కావలి : పెండింగ్‌లో ఉన్న ఆర్‌టిసి కార్మికుల సమస్యలు పరిష్కరించాలన్న ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం స్థానిక ఆర్‌టిసి డిపో ఎదుట ఎస్‌డబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌డబ్ల్యూఎఫ్ నాయకులు మాట్లాడుతూ డ్రైవర్లను మాములుగా టీమ్స్ డ్యూటీలకు తీసుకోవడం మానుకోవాలన్నారు. 1/2019 సర్క్యులర్‌ను అన్ని డిపోల్లో విధిగా అమలు చేయాలన్నారు. కెఎంపిఎల్- ఈపికెపై వేధింపులు మానుకోవాలన్నారు. లీవ్ పొజిషన్‌ను మెరుగు పరచాలన్నారు. గ్యారేజీలో బస్సులకు సరిపడా టూల్స్ ఏర్పాటు చేయాలన్నారు. అన్నిరకాల బకాయిలను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేసారు. కార్యక్రమంలో ఎస్‌డబ్ల్యుఎఫ్ నాయకులు డిఆర్ రెడ్డి, ఎం.ఎ.బేగ్, వి.వి.రెడ్డి, జి.వాసు, పి.ఎన్.రావు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.










