ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్ మున్సిపాలిటీలో వివిధ విభాగాల్లో పనిచేసే కార్మికుల సమస్యలన్నింటినీ పరిష్కరించాల ని మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షు డు ఎటిఎం నాగరాజు డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మట్లాడుతూ ఎపి మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయిస్ ఫెడరేషన్ సిఐటి యు అనుబంధ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని దశలవారీగా రిలే దీక్షలు, మున్సిపల్ కార్యాలయాల ముట్టడి వంటి కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ఈనెల 7న కలెక్టరేట్ ముట్టడిలో భాగంగా జిల్లావ్యాప్తంగా కార్మికులందరూ అనంతపురంలోని సంఘమేష్ సర్కిల్ నుండి ర్యాలీగా కలెక్టరేట్ వరకూ వెళ్లి కలెక్టరేట్‌ను ముట్టడించినట్లు తెలిపారు. కార్మికుల వీరోచిత పోరాటాలను గుర్తించిన మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఎపి మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయూస్ ఫెడరేషన్ సిఐటియు అనుబంధ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులను పిలిపించి కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారన్నారు. అయితే హామీతో సరిపెట్టే ప్రసక్తే లేదన్నారు. కాగా అనివార్య కారణాల వల్ల ఈనెల17న చేపట్టనున్న చలో విజయవాడ కార్యక్రమాన్ని 24వ తేదీకి మార్పు చేసినట్లు తెలిపారు. కార్మికులు ఈ విషయాన్ని గమణించాలని కోరారు. ఈసమావేశంలో జిల్లా కోశాధికారి బత్తల ఆదినారాయణ, నగర అధ్యక్షులు బండారు ఎర్రిస్వామి, కమిటీ సభ్యులు శ్రీనివాసమూర్తి, తదితరులు పాల్గొన్నారు.
విలేకరులతో మాట్లాడుతున్న మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎటిఎం నాగరాజు










