Oct 19,2022 21:48

కాణిపాకంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి
వరసిద్దుని దర్శించుకున్న నిర్మలా సీతారామన్‌
ప్రజాశక్తి - ఐరాల:
కేంద్ర ఆర్థిక మంత్రి, కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌లు బుధవారం సాయంత్రం కాణిపాకం వినాయకస్వామిని దర్శించుకున్నారు. వీరికి కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌, పూతలపట్టు ఎంఎల్‌ఎ ఎంఎస్‌ బాబు ఘనంగా స్వాగతం పలికారు. ఆలయ ఛైర్మన్‌ మోహన్‌రెడ్డి, ఈవో రాణాప్రతాప్‌, చిత్తూరు ఆర్డీఓ రేణుక స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం మంత్రులకు పండితుల ఆశీర్వాదంతో పాటు, ప్రసాదాలను అందించారు. చిత్తూరు ఎంపి రెడ్డెప్ప స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎంపి డాక్టర్‌ గురుమూర్తి, తిరుపతి జేసీ బాలాజీ, బిజెపి నాయకులు భానుప్రకాష్‌రెడ్డి, చామంతి శ్రీనివాస్‌, చిట్టిబాబు, దుర్గా రామకృష్ణ, వెంకటేష్‌ చౌదరి పాల్గొన్నారు. బుధవారం రాత్రి తిరుమలలో బస చేసి, గురువారం తెల్లవారుజామున తిరుమల శ్రీవారిని, శ్రీకాళహస్తి ఆలయాలను సందర్శించి తిరుగు ప్రయాణం కానున్నారు.