Oct 17,2022 22:46

కాణిపాకం వినాయకుని హుండీ లెక్కింపు
ప్రజాశక్తి -ఐరాల:
కాణిపాకం స్వయంభూ శ్రీవరసిద్ధి వినాయక స్వామి వారి హుండీ కానుకలను స్వామివారి ఆస్థాన మండపంలో 26రోజులు తరువాత సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు లెక్కించగా 1.53.81.575లక్షలు రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఆలయ ట్రస్టుబోర్డు ఛైర్మెన్‌ ఎ.మోహన్‌రెడ్డి, ఆలయ ఈఓ రాణాప్రతాప్‌లు తెలిపారు. అందులో బంగారు 98 గ్రాములు, వెండి 2కిలో 550 గ్రాములు, పారేన్‌ కరెన్సీ యుఎస్‌ఎ 679డాలర్స్‌, యూరో 5 యురోస్‌, సింగపూర్‌ రెండు డాలర్స్‌, ఆస్ట్రియా 70 డాలర్లు, యూఏఈ 80డిరామ్స్‌ ఆదాయం వచ్చినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ కమిషనర్‌ కస్తూరి, విద్యాసాగర్‌రెడ్డి, ఎస్వీ కష్ణారెడ్డి, రవ్రీంద్రబాబు, సూపరింటెండెంట్లు శ్రీధర్‌రావు బాబు, కోదండపాణి, పాలకమండల సభ్యులు నరసింహులు శెట్టి, చిత్తూరు జిల్లా ఏసీ ఏకాంబరంలతోపాటు ఆలయ సిబ్బంది కాణిపాకం యూనియన్‌ బ్యాంక్‌ శాఖ అధికార్లు పాల్గొని నట్లు వారు వివరించారు.