కాణిపాకం ఈవోగా బాధ్యతలు చేపట్టిన రాణా ప్రతాప్
ప్రజాశక్తి- ఐరాల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం కాణిపాకం నూతన కార్యనిర్వహణధికారిగా రాణా ప్రతాప్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మొదటిగా స్వామివారిని దర్శించుకుని స్వామివారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం వేద ఆశీర్వచనం మండపంలో వేదపండితులచే ఆశీర్వచనం తీసుకున్నారు. అనంతరం పాలకమండల చైర్మన్ మోహన్‌రెడ్డి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. కార్యనిర్వహణధికారి కార్యాలయంలో బాధ్యతలు చేపట్టి సిబ్బందితో కార్యాలయం మీటింగ్ హాల్‌లో సమావేశం నిర్వహించి పరిచయ కార్యక్రమం చేపట్టారు. ఆయన మాట్లాడుతూ సిబ్బంది ఉద్యోగంలో అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ మోహన్‌రెడ్డి, ఈఈ, ఏసి, ఏఈవోలు, పర్యవేక్షకులు, అర్చకులు వేదపండితులు పాల్గొన్నారు.










