కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించడం దారుణం
ప్రజాశక్తి-ఎస్‌ఆర్‌పురం: కాంట్రాక్ట్ ఉద్యోగులను సుమారు రెండు లక్షల 40 వేల మందిని తొలగించడం దారుణమని.. రహస్య జీవోలు ఇవ్వడం ఏంటని మాజీ మంత్రి అమరనాథ్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని క్షీరసముద్రం గ్రామంలో టీడీపీ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి గంధమనేని రాజశేఖర్‌నాయుడి ఇంటి వద్ద విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఇసుక, కల్తీ మద్యం, పెట్రోల్ ధరలు, నిత్యావసర వస్తువుల ధరల పెంచుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. గతంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారన్నారు. మండల పార్టీ అధ్యక్షుడు గంధమనేని జయశంకర్‌నాయుడు, ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు హేమాద్రి యాదవ్, గుండయ్య, బాలాజీ నాయుడు, బ్రహ్మయ్యనాయుడు, గురునాథం, మహబూబ్‌బాషా, మాధవ నాయుడు, వెంకటాచలం, భూపతి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










