ప్రజాశక్తి - కాళ్ల
కాళ్లకూరులో మోక్షథామం ఆధునికీకరణ పనులను ట్రస్ట్ వ్యవస్థాపకులు దాట్ల వెంకట్రామరాజు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతేడాది సెప్టెంబర్లో దాట్ల శ్రీదేవి మెమోరియల్ ట్రస్ట్‌ను ప్రారంభించి మోక్షధామంలో దహన గదులు నిర్మించామన్నారు. కాళ్లకూరు గ్రామస్తులకు మంచి కార్యక్రమాలు చేయాలనే దృక్పథంతో ట్రస్టు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ట్రస్టు ద్వారా కాళ్లకూరులో మోక్షధామం ఆధునికీకరణ పనులు రూ.10 లక్షలతో చేపట్టడంతో సుందరంగా కనిపిస్తోందన్నారు. ప్రతిభ కలిగిన విద్యార్థులకు, పేద ప్రజల దహన సంస్కారాలకు, పేదల వివాహానికి, కంటి ఆపరేషన్లకు ఆర్థికసాయం అందజేస్తున్నామన్నారు. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో బొర్రా వెంకటేశ్వరరావు, చిటికెన సూర్యనారాయణ పాల్గొన్నారు.










