Apr 26,2023 21:26

ప్రజాశక్తి - కాళ్ల
మండలంలోని 21 పంచాయతీలకు గాను 12 పంచాయతీలకు అవార్డులు రావడంపై ఎంపిపి శిరీష విశ్వనాథరాజు హర్షం వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా స్థానిక సుస్థిరాభివద్ధి లక్ష్యాల చేరువలో భాగంగా నిర్దేశించిన తొమ్మిది అంశాల్లో కాళ్ల గ్రామ పంచాయతీ నాలుగు అంశాల్లో సత్తా చాటింది. ఆరోగ్యం, పంచాయతీ, సుపరిపాలన, స్వయం సమృద్ధితో మౌలిక సదుపాయాలు, సామాజిక భద్రత అంశాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి నాలుగు అవార్డులను సాధించింది. ఈ సందర్భంగా కాళ్ల సర్పంచి బందా విజయ, గ్రామ కార్యదర్శి సతీష్‌కుమార్‌, సచివాలయ కార్యదర్శి ఎస్‌.సింధూజలను దుశ్శాలువాతో సన్మానించి అవార్డులను అందజేశారు.